సానియాతో చెర్రీ డ్యాన్స్.. ఉపాసన ఏమందంటే..!

| Edited By:

Dec 15, 2019 | 1:04 PM

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో ఆనమ్ నిఖా చేసుకుంది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక ఈ వివాహానికి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ దంపతులు కూడా వెళ్లారు. ఇక వేడుకల్లో భాగంగా సానియా మీర్జా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్‌తో  చెర్రీ డ్యాన్స్ వేశాడు. బాలీవుడ్ […]

సానియాతో చెర్రీ డ్యాన్స్.. ఉపాసన ఏమందంటే..!
Follow us on

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో ఆనమ్ నిఖా చేసుకుంది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక ఈ వివాహానికి టాలీవుడ్ హీరో రామ్ చరణ్ దంపతులు కూడా వెళ్లారు. ఇక వేడుకల్లో భాగంగా సానియా మీర్జా, బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్‌తో  చెర్రీ డ్యాన్స్ వేశాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ నటించిన ‘వార్’ చిత్రంలోని ‘గుంగ్రూ’ అనే పాటకు ఈ ముగ్గురు డ్యాన్స్ వేశారు. ఇక దానికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘‘దీన్నే డ్యాన్స్‌తో ఫ్లోర్‌ను అదరగొట్టడం అంటారు’’ అని కామెంట్ పెట్టింది. ఇక ఈ వీడియోకు అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులకు సానియా మీర్జా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు అప్పుడప్పుడు విదేశీ యాత్రలకు కూడా వెళ్తుంటారు.

కాగా ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 70శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు చెర్రీ.