చిరు గొప్పతనం.. చరణ్ మంచితనం.. మెగా ఫ్యాన్స్‌కు ఈ వీడియో కనులపండగే..

|

Apr 04, 2024 | 8:29 AM

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం బడా దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అటు చిరంజీవి కూడా తన సినిమాలతో బిజీగా మారిపోయారు.

చిరు గొప్పతనం.. చరణ్ మంచితనం.. మెగా ఫ్యాన్స్‌కు ఈ వీడియో కనులపండగే..
Ram Charan, Chiranjeevi
Follow us on

మెగా స్టార్ మెగా పవర్ స్టార్.. ఈ తండ్రి కొడుకులు టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా చరణ్ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచుకుంటుంటే.. కొడుకుతో పోటీ పడుతూ చిరంజీవి సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం బడా దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. అటు చిరంజీవి కూడా తన సినిమాలతో బిజీగా మారిపోయారు. చివరిగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు విశ్వంభర అనే సైన్స్ ఫిక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. అయితే ఈ తండ్రి కొడుకులు కలిసి స్టేజ్ పైన కనిపిస్తే అభిమానులకు పంగడే.. తాజాగా మెగా స్టార్, మెగా పవర్ స్టార్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో మెగా అభిమానులను అందడంలో తేలిపోయేలా చేస్తుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఎంట్రీలో ఒక్కసారిగా ఫోటో గ్రాఫర్లు, అభిమానులు అక్కడికి చేరుకొని ఈ ఇద్దరినీ క్లిక్ మనిపించారు ఇంతలో ఓ చిన్నారి అభిమాని రామ్ చరణ్ తో ఫోటో దిగలనుకుంది. అంతే వెంటనే చిరంజీవి ముందుకు జరిగి.. చరణ్ ను, ఆ అభిమానిని ఫోటో తీశారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.