Jailer twitter Review: థియేటర్ల వద్ద మొదలైన రజినీ ఫ్యాన్స్ సందడి.. జైలర్ ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందంటే

అమెరికాలో రజినీ ఫ్యాన్స్‌ సందడి చేశారు. థియేటర్ల వద్ద హంగామా చేశారు. ఇక కెనడాలో కూడా ఫ్యాన్స్‌ దుమ్మురేపుతున్నారు. జై తలైవా అంటూ స్లోగన్స్‌తో ఊగిపోతున్నారు. థియేటర్లలో డ్యాన్స్‌లు చేస్తూ పండగా చేసుకుంటున్నారు. జైలర్‌ మూవీ మాస్‌ ప్రేక్షకులకు పక్కాగా ఆకట్టుకుంటోంది. ఇది పక్కా మాస్‌ స్టైల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని అమెరికాకు చెందిన కొందరు యూజర్లు ట్విట్టర్‌ వేదికగా తమ రివ్వ్యూను పంచుకున్నారు. మరో యూజర్‌ జైలర్‌ మూవీ కచ్చితంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందంటూ ట్వీట్ చేశారు...

Jailer twitter Review: థియేటర్ల వద్ద మొదలైన రజినీ ఫ్యాన్స్ సందడి.. జైలర్ ట్విట్టర్‌ రివ్యూ ఎలా ఉందంటే
Jailer Movie First Day Collections

Updated on: Aug 10, 2023 | 8:21 AM

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం జైలర్. భారీ అంచనాల నడుమ జైలర్ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక సతమవుతోన్న రిజినీ ఆశాలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌లు సినిమాలపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈసారి తలైవా కచ్చితంగా హిట్‌ కొడుతాడని ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఉదయాన్నే థియేటర్ల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున సినిమా వీక్షించేందుకు థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్‌ ప్రారంభమయ్యాయి. అయితే అమెరికాలో పలు చోట్ల ప్రీమియర్స్‌ ఆలస్యమైంది. ఇక సినిమా చూస్తున్న ఫ్యాన్స్‌ తమ రివ్యూను ట్విట్టర్‌ వేదికగా పంచుకుంటున్నారు.? ఇంతకీ జైలర్‌ మూవీ ఎలా ఉంది.? రజినీ ఖాతాలో విజయం పడిందా.? ఇలాంటి విషయాలు తెలియాలంటే ట్విట్టర్‌ రివ్యూపై ఓ లుక్కేయండి..

అమెరికాలో రజినీ ఫ్యాన్స్‌ సందడి చేశారు. థియేటర్ల వద్ద హంగామా చేశారు. ఇక కెనడాలో కూడా ఫ్యాన్స్‌ దుమ్మురేపుతున్నారు. జై తలైవా అంటూ స్లోగన్స్‌తో ఊగిపోతున్నారు. థియేటర్లలో డ్యాన్స్‌లు చేస్తూ పండగా చేసుకుంటున్నారు. జైలర్‌ మూవీ మాస్‌ ప్రేక్షకులకు పక్కాగా ఆకట్టుకుంటోంది. ఇది పక్కా మాస్‌ స్టైల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని అమెరికాకు చెందిన కొందరు యూజర్లు ట్విట్టర్‌ వేదికగా తమ రివ్వ్యూను పంచుకున్నారు. మరో యూజర్‌ జైలర్‌ మూవీ కచ్చితంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ట్విట్టర్‌ రజినీ మ్యానియాతో ఊగిపోతోంది.

ఇక మరో యూజర్‌ స్పందిస్తూ.. ఫస్ట్‌ హాఫ్‌ చాలా బాగుందని, పూర్తి రజిని మ్యానియా అని రాసుకొచ్చారు. డార్క్‌ కామెడీ, కమర్షియల్‌ యాంగిల్స్‌ అన్ని అదిరిపోయాయి అంటూ ట్వీట్ చేశారు. ఇక రజినీ ఇంట్రడక్షన్‌ సన్నివేశం అదిరిపోయిందంటూ మరో యూజర్‌ స్పందించారు. కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయని, డైలాగ్స్‌ అదిరిపోయాయంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద జైలర్‌ మూవీకి ట్విట్టర్‌ వేదికగా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. మరి సినిమా పూర్తి టాక్‌ తెలియాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే..

జైలర్‌ చిత్రంపై ట్రెండ్ అవుతోన్న ట్వీట్స్‌ ఇవే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..