వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎవ్వరూ అంత ఈజీగా కెలికాలనుకోరు. ఎందుకంటే ఒక్కసారి గిల్లితే, ఆయన సెటైరికల్ కామెంట్లను తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే పేరుమోసిన సినీ, రాజకీయ ప్రముఖులు సైతం వర్మకు దూరంగా ఉంటూ వస్తుంటారు. ఇక ఆయనే ఎవరినైనా వివాదంలోకి లాగినా.. చాలామంది ఆయన నుంచి తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. అలాంటిది మొదటిసారిగా వర్మను ఆటపట్టిస్తూ ట్వీట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. వర్మ కుమార్తె ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు కంగ్రాట్స్ చెప్పిన జక్కన్న.. వర్మను కాస్త ఆటపట్టించారు.
Congratulations Ramu thaatayya garu…?????❤️❤️
Wishing your granddaughter will be the person who will finally rein you in… btw what do you prefer
Ramu tata
Ramu Nanna or
Grandpa Ramu…@RGVzoomin ???— rajamouli ss (@ssrajamouli) February 10, 2020
‘‘కంగ్రాట్స్ రాము తాతయ్య గారు. ఫైనల్‌గా మీ మనవరాలు మీకు కళ్లెం వేస్తుందని ఆశిస్తున్నా. ఇదంతా సరే గానీ మిమ్మల్ని రాము తాత, రాము నాన్న, గ్రాండ్‌పా రాము వీటిలో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు’’ అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు వర్మను సైతం ట్యాగ్ చేశారు. అయితే మనవరాలు వచ్చిన సంతోషమో.. మరేమో తెలీదు గానీ వర్మ మాత్రం ఇంకా రాజమౌళికి సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే గతంలో రాజమౌళిని ఉద్దేశిస్తూ పలుమార్లు ఆర్జీవీ ట్వీట్లు చేశారు. ఆ సమయంలో ‘‘అయ్యా.. నన్ను ఒగ్గేయండయ్యా’’.. ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాజు గారు’’ అంటూ రాజమౌళి కామెంట్లు పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల వర్మ జోరు తగ్గించారు. ఒకప్పుడు ఎప్పుడూ వివాదాల్లో ఉండే వర్మ.. ఈ మధ్యన కాంట్రవర్సీలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ట్విట్టర్‌లోనూ ఆయన సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మార్పుకు కారణమేంటోనని ఫ్యాన్స్ ఆలోచనల్లో పడ్డారు.