RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతోందా అని యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా దేశం దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం, ఎన్టీఆర్ (NTR).. రామ్ చరణ్ (RamCharan) కలిసి నటిస్తుండడంతో ఆకాశాన్ని తాకే అంచనాలు ఈ సినిమా సొంతమయ్యాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్, పాటలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి. ఇందులో భాగంగానే భారీ సెట్టింగ్, యాక్షన్ సన్నివేశాలతో విజువల్ ట్రీట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.
అందరి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక విడుదలకు ముందే ఆర్‌ఆర్‌ఆర్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్ షోలతోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు మరో విజువల్ ట్రీట్‌ను అందించేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని ఏకంగా 3డీ వెర్షన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారంగా ప్రకటించింది. ఏయే థియేటర్లలో 3డీ వెర్షన్ విడుదల కానుందన్న విషయం త్వరలోనే ప్రకటించనున్నారు.
దీంతో అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. జక్కన్న మార్క్ యాక్షన్ సన్నివేశాలను 3డీలో వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక విడుదలకు కొన్ని రోజులే సమయం ఉండడంతో ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రీరిలీజ్ ఈవెంట్‌తో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన యూనిట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తోంది.
Experience never-seen-before action and drama in 3D at cinemas near you from March 25th. ???#RRRin3D #RRRMovie #RRROnMarch25th pic.twitter.com/vChlYOkq4e
— BA Raju’s Team (@baraju_SuperHit) March 20, 2022
RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ఫంక్షన్‌లో జనసేన జెండాల సందడి.. నెట్టింట వీడియో వైరల్
COVID Cases: ప్రపంచవ్యాప్తంగా ఫోర్త వేవ్ విజృంభణ.. భారత్‌లో తగ్గుతున్న కేసులు.. అయినా..