రేపటి నుంచి ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్‌..!

| Edited By:

Sep 30, 2020 | 4:10 PM

రెబల్‌స్టార్ ప్రభాస్‌తో రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధేశ్యామ్‌. పీరియాడిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది

రేపటి నుంచి ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్‌..!
Follow us on

Prabhas Radhe Shyam movie: రెబల్‌స్టార్ ప్రభాస్‌తో రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధేశ్యామ్‌. పీరియాడిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. కరోనా లాక్‌డౌన్ వలన ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్‌ప రాగా.. రేపటి నుంచి చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో నటించే ప్రధానపాత్రాధారులందరూ గత రాత్రి ఇటలీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రేపటి నుంచి కొవిడ్ నిబంధనలకు అనుసరిస్తూ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. నాలుగు వారాల పాటు అక్కడ షూటింగ్‌ని పూర్తి చేసుకొని అక్టోబర్ చివరి వారంలో తిరిగి హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. ఇక ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, పూజాపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా తొలిసారిగా రొమాన్స్ చేస్తుండగా.. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, టీసిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని పలు భాషల్లో విడుదల చేయనున్నారు.

Read More:

ఏపీలో పదేళ్ల తరువాత తెరుచుకోనున్న బాపు మ్యూజియం

లైంగిక వేధింపుల కేసు.. అనురాగ్ కశ్యప్‌కి సమన్లు