అదే నా నిత్య యవ్వన రహస్యం.. గుట్టు విప్పిన మాధవన్‌

ఒంటి మీదికి 50 ఏళ్లు వచ్చినా మాధవన్‌ అలా కనిపించరు. తన గ్లామర్‌తో ఇప్పటి హీరోలకు సైతం పోటీ ఇస్తూ మన్మధుడిగా కొనసాగుతున్నారు.

అదే నా నిత్య యవ్వన రహస్యం.. గుట్టు విప్పిన మాధవన్‌

Edited By:

Updated on: Nov 09, 2020 | 3:33 PM

Madhavan funny reply: ఒంటి మీదికి 50 ఏళ్లు వచ్చినా మాధవన్‌ అలా కనిపించరు. తన గ్లామర్‌తో ఇప్పటి హీరోలకు సైతం పోటీ ఇస్తూ మన్మధుడిగా కొనసాగుతున్నారు. ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌ మాధవన్‌కి గుర్తు చేశారు. మాధవన్‌ ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన నెటిజన్‌.. ”వయసు‌ అన్నది మాధవన్‌ఫైడ్ అయ్యింది. ఆయన ఎప్పుడూ యవ్వనంగానే కనిపిస్తారు” అని కామెంట్‌ పెట్టారు. దానికి స్పందించిన కోలీవుడ్ మన్మధుడు.. అదంతా మంచి డై మహిమ అని ఫన్నీగా కామెంట్ పెట్టారు. ( పవన్‌ మూవీలో రానా.. స్పందించిన దగ్గుబాటి హీరో)

కాగా అనుష్క సరసన మాధవన్ నటించిన నిశ్శబ్దం గత నెల ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం ఈ నటుడు రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్‌ అనే మూవీలో నటిస్తున్నారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయన్‌ జీవిత కథగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీంతో పాటు మరో వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనున్నారు. ( ‘నగ్నత్వం’ నేరమైతే.. నాగ బాబాలను అరెస్ట్ చేయండి: పూజా సంచలన వ్యాఖ్యలు)