మహేశ్- అనిల్ చిత్రానికి నిర్మాతలు ఎవరంటే..!

మహేశ్ తదుపరి చిత్రం దాదాపుగా ఖరారైంది. ‘ఎఫ్ 2’ ఈ ఏడాది ప్రారంభంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. మహేశ్ 26వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. కాగా ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజునే నిర్మించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్‌తో వరుసగా ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ చిత్రాలను తెరకెక్కించిన దిల్ రాజు.. ఆ మూడు చిత్రాలతో మంచి హిట్‌లను ఖాతాలో […]

మహేశ్- అనిల్ చిత్రానికి నిర్మాతలు ఎవరంటే..!

మహేశ్ తదుపరి చిత్రం దాదాపుగా ఖరారైంది. ‘ఎఫ్ 2’ ఈ ఏడాది ప్రారంభంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. మహేశ్ 26వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. కాగా ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజునే నిర్మించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అనిల్‌తో వరుసగా ‘సుప్రీం’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’ చిత్రాలను తెరకెక్కించిన దిల్ రాజు.. ఆ మూడు చిత్రాలతో మంచి హిట్‌లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ హిట్‌లతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో అనిల్ తదుపరి చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజునే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో తన చిత్రాల ద్వారా నష్టపోయిన అనిల్ సుంకరను ఆదుకోవాలని మహేశ్ అనుకుంటున్నాడట. దీంతో మహేశ్.. అనిల్ సుంకర్‌ను ఈ చిత్రం కోసం భాగస్వామిని చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేశ్ 26వ చిత్రాన్ని కూడా ఇద్దరు నిర్మాతలు నిర్మించనున్నారు. కాగా మహేశ్ ప్రస్తుతం నటిస్తోన్న ‘మహర్షి’ చిత్రాన్ని దిల్ రాజు, పీవీపీ ప్రసాద్, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published On - 6:05 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu