AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌ కోసం ఎదురుచూస్తోన్న బడా నిర్మాత.. ఎందుకంటే..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్‌ 'ఆర్ఆర్‌ఆర్' కోసం యావత్ దేశ సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' రిలీజ్‌ కోసం ఎదురుచూస్తోన్న బడా నిర్మాత.. ఎందుకంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 18, 2020 | 4:50 PM

Share

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్‌ ‘ఆర్ఆర్‌ఆర్’ కోసం యావత్ దేశ సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మొదటిసారిగా ఇద్దరు స్టార్ హీరోలతో జక్కన్న తీస్తున్న ఈ సినిమా ‘బాహుబలి’ రికార్డులను తిరగరాస్తుందని అందరూ భావిస్తున్నారు. కాగా ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకుల్లాగానే టాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాత ఎదురుచూస్తున్నారట. ఆ మూవీ విడుదల తరువాతే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని ఆయన అనుకుంటున్నారట. ఇంతకు ఆయనెవరంటే.. అల్లు అరవింద్.

కొన్ని నెలల క్రితం అల్లు అరవింద్ రూ.1500కోట్లతో రామాయణం ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మధు మంతెన, నమిత్‌ మల్హోత్రాతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పలు భారతీయ భాషల్లో తెరకెక్కించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అధికారిక ప్రకటన వచ్చి చాలా నెలలే గడవడం.. ఆ తరువాత ఆ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందన్న పుకార్లు మొదలయ్యాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోలేదట. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తరువాత ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని అల్లు అరవింద్ అనుకుంటున్నారట. పీరియడ్ డ్రామాగా ఆర్ఆర్ఆర్‌ తెరకెక్కుతుండగా.. దేశవ్యాప్తంగా ఆ సినిమాకు వచ్చే స్పందనను చూసి.. రామాయణంను తెరకెక్కించాలని అల్లు అరవింద్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కనుంది..? ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు..? ఏ దర్శకుడు ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: చిరు సినిమాలో కీలక పాత్రలో బన్నీ..!

Follow Us
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!