పీవీపీ ‘మహర్షి’ టీంకు భలే సర్ఫ్రైజ్ ఇచ్చాడుగా..

హైదరాబాద్: టాలీవుడ్‌లో గ్రాండియర్‌గానే కాకుండా సోల్ ఉన్న సినిమాలు తీయడంలో ప్రొడ్యూసర్ పీవీపీ ముందుంటారు. ఊపిరి, బ్రహ్మోత్సవం, సైజ్ జీరో లాంటి సినిమాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చినవే. తాాజాగా మహేశ్‌బాబు 25వ మూవీగా వస్తున్న ‘మహర్షి’ మూవీని దిల్ రాజు, అశ్వనీదత్‌తో కలిసి పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్‌లో గల పీపుల్స్ ప్లాజాలో జరిగింది. ఈ సందర్భంగా పీవీపీ హీరో మహేశ్‌బాబుతో, దర్శకుడు వంశీ పైడిపల్లితో తన […]

పీవీపీ ‘మహర్షి’ టీంకు భలే సర్ఫ్రైజ్ ఇచ్చాడుగా..

Updated on: May 01, 2019 | 9:23 PM

హైదరాబాద్: టాలీవుడ్‌లో గ్రాండియర్‌గానే కాకుండా సోల్ ఉన్న సినిమాలు తీయడంలో ప్రొడ్యూసర్ పీవీపీ ముందుంటారు. ఊపిరి, బ్రహ్మోత్సవం, సైజ్ జీరో లాంటి సినిమాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చినవే. తాాజాగా మహేశ్‌బాబు 25వ మూవీగా వస్తున్న ‘మహర్షి’ మూవీని దిల్ రాజు, అశ్వనీదత్‌తో కలిసి పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్‌లో గల పీపుల్స్ ప్లాజాలో జరిగింది. ఈ సందర్భంగా పీవీపీ హీరో మహేశ్‌బాబుతో, దర్శకుడు వంశీ పైడిపల్లితో తన అనుబందాన్ని పంచుకన్నారు. పనిలో పనిగా టీం అందరికి ఓ సర్ఫ్రైజ్ కూడా ఇచ్చారు. హీరోకి చెప్పకుండానే మే 18న విజయవాడలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామని చెప్పగానే టీం అందరి ఫేసుల్లో నవ్వులు విరబూశాయి. స్టేడియం కూడా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ప్రొడ్యూసర్‌కి సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూసి సినిమా ప్రేమికులు వారెవ్వా అంటున్నారు. కాగా ‘మహర్షి’ మూవీ ఈ నెల 9న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.