ఆ ఐదుగురే థియేట‌ర్లు ఓపెన్ కాకుండా చేస్తున్నారు.. సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు

|

Dec 18, 2020 | 1:13 PM

హైద‌రాబాద్‌: సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలగుు సినీ పరిశ్రమలో ఐదుగురు మాత్రమే సినిమా థియేటర్లు తెరుచుకోకుండా చేస్తున్నారని ఆరోపించారు...

ఆ ఐదుగురే థియేట‌ర్లు ఓపెన్ కాకుండా చేస్తున్నారు.. సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు
Follow us on

హైద‌రాబాద్‌: సినీ నిర్మాత నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలగుు సినీ పరిశ్రమలో ఐదుగురు మాత్రమే సినిమా థియేటర్లు తెరుచుకోకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇలా సినిమా థియేటర్లు తెరుచుకోకుండా చేస్తున్నందుకు రెండు తెలుగు రాష్ట్రాల కోర్టులకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దయచేసి సినిమా థియేటర్లను ఓపెన్ చేయనవ్వండి అంటూ నట్టికుమార్ కోరారు.

కరోనా కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు ఇప్పటి వరకు తెరుచుకోకపోవడంతో ఎందరో నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతోందని, దాదాపు అన్ని రంగాలు తెచుకుని పనులు కొనసాగిస్తున్నాయని, థియేటర్లు ఓపెన్ కాకుండా చేస్తున్నందుకు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీం కోర్టుకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. చిన్న సినిమాలను, చిన్న జీవితాలను బతికించండి అంటూ నిర్మాత నట్టికుమార్ కోరారు.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా గత ఎనిమిది నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినీ ఇండస్ట్రీ సైతం తీవ్రంగా దెబ్బతింది. సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న చిన్న నుంచి పెద్దల వరకు అందరూ నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటీవల సినిమా షూటింగ్ లు, టీవీ షూటింగ్, థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. కానీ పూర్తి స్థాయిలో మాత్రం థియేటర్లు తెరుచుకోలేదు.