Priyanka Chopra: క్రిస్మస్‌ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసిన ప్రియాంక..

|

Nov 20, 2021 | 7:47 AM

గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు పొందిన ప్రియాంకా చోప్రా ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే..

Priyanka Chopra: క్రిస్మస్‌ కానుకగా రానున్న మ్యాట్రిక్స్4.. కొత్త పోస్టర్‌ను షేర్‌ చేసిన ప్రియాంక..
Follow us on

గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు పొందిన ప్రియాంకా చోప్రా ప్రస్తుతం పలు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘మ్యాట్రిక్స్’ సిరీస్‌ కూడా ఒకటి. ఇండియన్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక ‘ది మ‍్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌’ కొత్త పోస్టర్‌ను పంచుకోవడంతో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెబంబర్‌ 22న థియేటర్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌లో ఒకేసారి విడుదల కానుంది.

మేడమ్‌..మీరెక్కడున్నారు..?
‘ఈ మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్ కొత్త పోస్టర్‌తో తిరిగి మ్యాట్రిక్స్‌లోకి అడుగు పెట్టండి. ఈ క్రిస్మస్‌కి థియేటర్‌లలో, హెచ్‌బీవో మ్యాక్స్‌లో చూడండి’ అని పీసీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ సెప్టెంబర్లోనే విడుదలైంది. అందులో ప్రియాంక కనిపించి కొన్ని సెకన్ల పాటు కనువిందు చేసింది. అయితే తాజాగా విడుదలైన పోస్టర్‌లో మాత్రం ఈ ముద్దుగుమ్మ కనిపించలేదు. దీంతో ఓ నెటిజన్‌ ‘పోస్టర్‌లో మీరు ఎక్కడ ఉన్నారు’ అని కామెంట్ పెట్టాడు. ఈ సినిమాలో హాలీవుడ్‌ స్టార్‌ కీన్‌ రీవ్స్‌తో పాటు క్యారీ-అన్నె మోస్‌, జడా పింకెట్‌ స్మిత్‌, యహ్యా అబ్దుల్‌ మాటీన్‌, జోనాథన్‌ గ్రోఫ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యాట్రిక్స్‌ సిరీస్‌లో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. లానా వాచోస్కీ మ్యాట్రిక్స్‌ రిసరెక్షన్ కు దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:

Superstar Krishna: ఆయన చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసేవారు.. అనుకున్న బ‌డ్జెట్‌లో చేసేవారు : సూపర్ స్టార్ కృష్ణ

Evelyn Sharma: అమ్మగా ప్రమోషన్‌ పొందిన సాహో సుందరి.. తల్లి పాత్ర పోషించే టైమొచ్చిందంటూ పోస్ట్‌..

Bigg Boss 5 Telugu: మాట మార్చిన కాజల్.. షాక్ తిన్న మానస్.. చివరకు సన్నీ విన్..