
ఓ చిన్న వీడియోతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారింది వింక్ గర్ల్ ప్రియా వారియర్. దీంతో ఒక్క రోజులోనే ఆమె ఇన్‌స్టా ఖాతాకు ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. ఇక్కడి వారే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆమె అకౌంట్‌కి చాలా మంది ఫాలో కొట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమెకు 7.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసింది. కారణాలు తెలీవు గానీ.. కొద్ది రోజుల పాటు ఇన్‌స్టాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ప్రియా, తన అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన సామాజిక మాధ్యమాల్లో మాత్రం తన ఖాతాను అలానే ఉంచుకుంది ప్రియ.
కాగా ఒరు ఆధార్ లవ్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఆ తరువాత తానాహా అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించే చిత్రంలో నటిస్తోంది. ఇక ప్రియ నటించిన విష్ణు ప్రియ(కన్నడ మూవీ), శ్రీదేవీ బంగ్లా (బాలీవుడ్ మూవీ) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే మహేష్ బాబు తదుపరి మూవీలో ప్రియకు ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది.
Read This Story Also: అనుష్క ఫ్యామిలీతో ఆ మాజీ డాన్‌కి సంబంధాలు..!