Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుష్క ఫ్యామిలీతో ఆ మాజీ డాన్‌కి సంబంధాలు..!

మాజీ అండర్ వరల్డ్ డాన్, ద గాడ్‌ఫాదర్ ఆఫ్ బెంగళూరుగా పేరొందిన ముత్తప్ప రాయ్‌ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ మాజీ డాన్‌.. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు. కాగా ఇతడు ప్రముఖ నటి అనుష్క శెట్టి ఫ్యామిలీకి సమీప బంధువని సమాచారం. అంతేకాదు ఆ మధ్యన అనుష్క దేశ వ్యాప్తంగా ఆలయాల సందర్శనకు వెళ్లగా.. అక్కడ ఈ భామ వెంట రాయ్‌ కూడా […]

అనుష్క ఫ్యామిలీతో ఆ మాజీ డాన్‌కి సంబంధాలు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 17, 2020 | 2:39 PM

మాజీ అండర్ వరల్డ్ డాన్, ద గాడ్‌ఫాదర్ ఆఫ్ బెంగళూరుగా పేరొందిన ముత్తప్ప రాయ్‌ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ మాజీ డాన్‌.. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం తుదిశ్వాస విడిచారు. కాగా ఇతడు ప్రముఖ నటి అనుష్క శెట్టి ఫ్యామిలీకి సమీప బంధువని సమాచారం. అంతేకాదు ఆ మధ్యన అనుష్క దేశ వ్యాప్తంగా ఆలయాల సందర్శనకు వెళ్లగా.. అక్కడ ఈ భామ వెంట రాయ్‌ కూడా ఉన్నారు. ఇక ఈయన మరణంతో అనుష్క కుటుంబం తీవ్ర విషాదంలో ముగినినట్లు తెలుస్తోంది.

కాగా ఓ సాధారణ బ్యాంక్‌ ఉద్యోగిగా మొదలైన రాయ్‌ ప్రస్థానం అండర్‌ వరల్డ్ డాన్ వరకు సాగింది. 30 ఏళ్ల పాటు బెంగళూరు అండల్‌ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఈయన ఏలారు. ఆ తరువాత దుబాయ్‌లో తలదాచుకోగా.. 2000లో ఆ దేశం భారత్‌కు అప్పగించింది. ఆ తరువాత ఈ డాన్‌ సామ్రాజ్యానికి దూరంగా ఉండాలని భావించిన రాయ్‌.. కర్ణాటక అనే ఎన్జీవోను ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు సహాయం చేశారు. ఇక వీరప్పన్ సినిమా తీసే సమయంలో.. వర్మకు రాయ్‌ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియగా.. ఆయనపై మూవీ తీయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఇందులో ప్రధాన పాత్రాధారుడిగా వివేక్ ఒబెరాయ్‌ పేరును అనౌన్స్ చేశారు. కారణాలు తెలీవు కానీ.. వర్మ ప్రకటన చేసి వదిలేసిన సినిమాల్లో ఇది ఉండిపోయింది. మరోవైపు ఈ ఏడాది జనవరిలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రాయ్‌.. తనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉందని, దీంతో ఐదేళ్లకు మించి బతకనంటూ ప్రకటించారు.

Read This Story Also:  రాష్ట్రాలు మరిన్ని రుణాలు కోరవచ్చు.. నిర్మలా సీతారామన్