తెలుగులోకి వింక్ బ్యూటీ..!

|

Jun 05, 2019 | 1:55 PM

‘ఒరు ఆదార్ లవ్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సంపాదించింది యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ సినిమా మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువైయ్యాయి. అయితే తాజాగా ప్రియా వారియర్ తెలుగులో ఒక ఛాన్స్ దక్కించుకుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా […]

తెలుగులోకి వింక్ బ్యూటీ..!
Follow us on

‘ఒరు ఆదార్ లవ్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సంపాదించింది యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ సినిమా మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువైయ్యాయి. అయితే తాజాగా ప్రియా వారియర్ తెలుగులో ఒక ఛాన్స్ దక్కించుకుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా వారియర్ ను తీసుకున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఈ సినిమా పూర్తైన తర్వాత.. చంద్రశేఖర్ ఏలేటి ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని సమాచారం.