‘కోమలి’ ఫేం ప్రదీప్ రంగనాధన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ టుడే’. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తమిళనాట నవంబర్ 4వ తేదీన చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక తెలుగులో ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. నవంబర్ 25న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది.
ఈతరం లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడిగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోన్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ వచ్చేసింది. డిసెంబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా సదరు ఓటీటీ విడుదల చేసింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్.. ఆ రోజు నుంచి కేవలం తమిళ భాషలో మాత్రమే ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు భాషలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం..