
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ప్రభాస్ సోదరి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఇందులో ఆమె నటించడం లేదు. ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న వారిలో ఆమె ఒకరు.
వివరాల్లోకి వెళ్తే.. రాధే శ్యామ్ ఫస్ట్‌లుక్ ఇవాళ విడుదలైంది. అందులో ప్రభాస్, పూజా రొమాంటిక్ లుక్‌లో దర్శనమివ్వగా.. పోస్టర్‌లో ప్రభాస్ సోదరి ప్రసీదా పేరు కూడా ఉంది. కృష్ణం రాజు పెద్ద కుమార్తె అయిన ప్రసీదా ప్రస్తుతం గోపీకృష్ణ బ్యానర్ పనులను చూసుకుంటోంది. ఈ క్రమంలో రాధే శ్యామ్ ద్వారా ఆమె సహ నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
Presenting you the title and first look of #Prabhas20#RadheShyam #Prabhas20FirstLook
Starring #Prabhas @hegdepooja
Director @director_radhaa
Presented by @UVKrishnamRaju garu #GopikrishnaMovies
Producers @UV_Creations @TSeries @itsBhushanKumar #Vamshi #Pramod @PraseedhaU pic.twitter.com/aX56HfpzNQ— UV Creations (@UV_Creations) July 10, 2020
కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న రాధే శ్యామ్‌లో భాను శ్రీ, మురళీ శర్మ, సచిన్ కేద్కర్, సత్యన్, ఎయిర్‌టెల్ భామ సాషా ఛత్రీ, కునాల్ రాయ్ కపూర్‌లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ నిర్మిస్తోన్న ఈ మూవీని గోపీకృష్ణ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పించనున్నారు.