బహుబలి సినిమా సూపర్ హిట్ సాధించిన తర్వాత టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే జోరులో ప్రభాస్ వరుస సినిమాలకు ఓకే చెప్పారు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తికావోస్తుంది. అటు రాధేశ్యామ్ మూవీ కాకుండా ప్రభాస్ ఇంకా పలు సినిమాలకు ఓకే చెప్పారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ చేయునున్నాడు ఈ స్టార్ హీరో. అంతేకాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి సలార్ మూవీ చేయనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రక్రియను జనవరి మూడో వారంలో ప్రారంభించనున్నట్లుగా టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కినస్తున్న కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి కాగానే సలార్ మూవీ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలు పెట్టి కేవలం నాలుగు నెలల్లో మూవీ చిత్రీకరణ పూర్తిచేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్తాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని.. అందులో ఒకరు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరీ చూడాలి ఈ నిజంగానే ప్రభాస్ సలార్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.