
Prabhas radhe Shyam: రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు ప్రభాస్. నెక్ షర్ట్‌తో, స్టైలిష్ కళ్లద్దాలతో ప్రభాస్ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ప్రభాస్ లుక్ చూసిన ఫ్యాన్స్ వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా రొమాంటిక్ ప్రేమ కథగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు.
Read More:
విజయ్ సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు
మహిళ అదృశ్యం కేసు విచారణలో అలసత్వం..కొత్తపల్లి ఎస్సై సస్పెండ్