Sonu Sood : రియల్ హీరో సోనూసూద్ పై పోలీసులకు ఫిర్యాదు… చేసింది ఎవరో తెలుసా..?

కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్ లో వలస కార్మికుల పాలిట దైవంగా మారదు సోనూసూద్. కష్టం అన్నవారికి లేదనకుండా సాయం అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దేశం మొత్తం సోనూసూద్

Sonu Sood : రియల్ హీరో సోనూసూద్ పై పోలీసులకు ఫిర్యాదు... చేసింది ఎవరో తెలుసా..?

Updated on: Jan 07, 2021 | 1:10 PM

Sonu Sood : కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్ లో వలస కార్మికుల పాలిట దైవంగా మారదు సోనూసూద్. కష్టం అన్నవారికి లేదనకుండా సాయం అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దేశం మొత్తం సోనూసూద్ పైన ప్రసంశల వర్షం కురిపించింది. అయితే తాజాగా సోనూసూద్ పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయ్యింది. ముంబైలోని ఓ ఆరు అంతస్తుల భవనాన్ని మునిసిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా హోటల్ గా మార్చారని పోలీసులకు ఫిర్యాదు అందింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా భవనాన్ని హోటల్ గా మార్చారని  ఫిర్యాదు చేసింది బీఎంసీ. దాంతో ఈ విషయం పై సోనూసూద్ స్పందించారు. తాను భవనాన్ని హోటల్ గా మార్చడానికి బీఎంసీ పర్మిషన్ తీసుకున్నానని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. అయితే.. కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ పర్మిషన్ రావాల్సి ఉందన్నాడు. దరఖాస్తు చేసుకున్నానని కరోనా కారణంగానే అనుమతి ఇంకా రాలేదని తెలిపాడు. ఒకవేళ అనుమతి రాకుంటే తన హోటల్ ను తొలగిస్తానని స్పష్టం చేశారు సోనూసూద్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kamal Haasan Comments : త్వరలోనే రజినీకాంత్‌ని కలుస్తా.. నాకు మద్దతు ఇవ్వమని కోరుతా.. కమల్ హాసన్ కామెంట్స్

చీఫ్ జ‌స్టిస్‌గా హిమా కోహ్లీ ప్రమాణం, తెలంగాణ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఘనత