‘శాక్రిఫైజింగ్ స్టార్’‌ సునిశిత్ అరెస్ట్‌

| Edited By:

Jul 23, 2020 | 6:10 PM

సునిశిత్‌ గుర్తున్నాడా..! కరోనా హాట్‌ టాపిక్‌గా మారక ముందు యూట్యూబ్‌లో ఇతగాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను త్యాగం చేస్తేనే ఎన్నో సినిమాలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్‌ నటులకు వెళ్లాయని..

శాక్రిఫైజింగ్ స్టార్‌ సునిశిత్ అరెస్ట్‌
Follow us on

సునిశిత్‌ గుర్తున్నాడా..! కరోనా హాట్‌ టాపిక్‌గా మారక ముందు యూట్యూబ్‌లో ఇతగాడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను త్యాగం చేస్తేనే ఎన్నో సినిమాలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్‌ నటులకు వెళ్లాయని.. ఎన్నో సినిమాలకు డైలాగ్‌లు రాశానని, పాటలు పాడానని, మా అసోసియేషన్‌కి పనిచేశానని, యాంకర్‌ ప్రదీప్ తన స్టోరీని కొట్టేశాడని.. ఒక్కటేమిటి, ఇలాంటివి చాలానే చెప్పుకొచ్చాడు. అంతేనా.. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నానని, ఆ తరువాత విడిపోయామని మాట్లాడాడు. ఇక మిగిలిన హీరోయిన్లు కూడా తన లవర్లేనంటూ యూట్యూబ్‌లో తన వ్యాఖ్యలతో హల్‌చల్ చేశాడు. ఈ క్రమంలో ఇతగాడికి శాక్రిఫైజింగ్‌ స్టార్ అనే బిరుదును ఇచ్చారు నెటిజన్లు. ఇక మీమర్లు సునిశిత్‌పై ఏ రేంజ్‌లో మీమ్స్ చేశారు.

ఇదిలా ఉంటే సునిశిత్‌పై లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు మరికొందరు కూడా సునిశిత్‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇతగాడిపై రాచకొండ కమిషనరేట్‌లో రెండు కేసులు, ఇబ్రహీంపట్నం కీసరలో ఒక కేసు నమోదైంది. వాటిని విచారిస్తోన్న పోలీసులు తాజాగా సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్నారు.