పవన్‌తో రెండోసారి.. హిట్ కాంబో రిపీట్ అవ్వబోతోందా..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రెండు సినిమాల షూటింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

పవన్‌తో రెండోసారి.. హిట్ కాంబో రిపీట్ అవ్వబోతోందా..!

Edited By:

Updated on: Apr 17, 2020 | 3:24 PM

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో రెండు సినిమాల షూటింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వకీల్ సాబ్ ఒకటి. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల దసరాకు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. ఇక శ్రుతీ హాసన్ ఫైనల్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన శ్రుతీ.. తాను ఈ మూవీలో లేనని స్పష్టం చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌లో పవన్ సరసన ఇలియానా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ అన్నీ కుదిరితే 12 సంవత్సరాల తరువాత పవన్‌తో ఇలియానా మళ్లీ రొమాన్స్ చేసే అవకాశం ఉంది. కాగా జల్సా మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించగా.. ఆ విజయం పెద్ద విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రల్లో అంజలి, నివేథా థామస్‌, అనన్య నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత పవన్ రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ మూవీపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Read This Story Also: ‘ఆచార్య’ విషయంలో మహేష్‌కి, నాకు మధ్య జరిగిన సంభాషణ ఇదే..!