Pawan Kalyan : ‘గోపాల గోపాల’ దర్శకుడితో మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా.. కానీ ఈసారి ఇలా…

|

Jan 11, 2021 | 9:00 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసిన పవన్. రానాతో కలిసి నటిస్తున్న సినిమాను..

Pawan Kalyan : గోపాల గోపాల దర్శకుడితో మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా.. కానీ ఈసారి ఇలా...
Follow us on

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసిన పవన్. రానాతో కలిసి నటిస్తున్న సినిమాను కూడా పట్టాలెక్కించాడు. మరో వైపు క్రిష్ సినిమాను కూడా మొదలు పెట్టలని చూస్తున్నాడు. ఈ  సినిమాలతర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాను లైన్ లో ఉన్నాయి. అయితే తాజాగా పవన్ తో ‘గోపాలగోపాల’ సినిమా తెరకెక్కించిన దర్శకుడు డాలీతో సినిమా చేయాలని చూస్తున్నాడట పవన్.

అయితే ఈ సినిమా పవన్ హీరోగా తెరకెక్కడంలేదట. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తాడని టాక్. వరుణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో వచ్చే సినిమాకు పవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నడని ఫిలిం నగర్లో వార్త చక్కర్లు కొడుతుంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే నితిన్ ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ’ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పడు వరుణ్ సినిమాకు కూడా పవన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాడేమో చూడాలి.