ఆ భారీ సినిమాలో రష్మిక ను ఎంపిక చేయలేదట .. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 

|

Nov 25, 2020 | 5:03 PM

స్టార్ హీరో సూర్య ఎట్టకేలకు సాలిడ్ హిట్ అందుకున్నాడు లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో  సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా ఇటీవల ఓటీటీ లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ భారీ సినిమాలో రష్మిక ను ఎంపిక చేయలేదట .. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు 
Follow us on

స్టార్ హీరో సూర్య ఎట్టకేలకు సాలిడ్ హిట్ అందుకున్నాడు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో  సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఇటీవల ఓటీటీ లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సూర్య పాండి రాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ రష్మిక మందన ను ఎంపిక చేసారని జోరుగా ప్రచారం సాగుతుంది. తెలుగులో కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక. సూర్య తమ్ముడు కార్తీ హీరోగా నటిస్తున్న ‘సుల్తాన్’ సినిమాతో తమిళ్ లోకి అడుగుపెడుతుంది. ఆతర్వాత వెంటనే అన్న సూర్య సినిమాలోనూ అవకాశం దక్కించుకుందని కోలీవుడ్ లో  గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై దర్శకుడు పాండి రాజ్ స్పందించారు. ఇప్పటివరకు హీరోయిన్ ను ఎంపిక చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ ను ఎంపిక చేసిన వెంటనే ఆదికారికంగా ప్రకటిస్తాం . ఇప్పటివరకు జరిగిన ప్రచారం అంతా అవాస్తవం. అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక  రష్మిక ఇటు తెలుగులో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా ఈ అమ్మడిని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీని పై  కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.