Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..

Bhama Kalapam trailer: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదం అందిస్తూ.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆన్‌లైన్ ప్రపంచంలో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ చిత్రాలు,

Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..
Bhama Kalapam

Updated on: Jan 30, 2022 | 4:37 PM

Bhama Kalapam trailer: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదం అందిస్తూ.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఆన్‌లైన్ ప్రపంచంలో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, టాక్ షోలతో ప్రక్షేకులకు మరింత చేరువైంది. అంతేకాకుండా.. ఇతర భాషల్లోని సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ దిశగా ముద్రవేసుకుంది. ఆహా.. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన ప్రియమణి (priyamani) తో మరో విభిన్న ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన అభిమన్యు తాడిమేటి కథ, దర్శకత్వం వహించిన భామా కలాపం అనే వెబ్ సిరీస్ ఆహాలో రాబోతుంది. ఈ సిరీస్ అతి తర్వలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ఈ షోపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.

కాగా.. భామా కాలాపం సిరీస్ ట్రైలర్‌ను సోమవారం రౌడీహీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విడుదల చేయనున్నారు. రేపు హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, ప్రియమణి తదితరులు హాజరుకానున్నారు. దీంతోపాటు ఆహా యాజమాన్యం సైతం హాజరుకానుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 11 నుంచి ప్రసారం అవుతుందని ఆహా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

ఇదిలాఉంటే.. అంతకుముందు విడుదలైన గ్లింప్స్.. ప్రేక్షకులను బాగా అలరించింది. యూట్యూబ్ లో వంటల రెసిపీలు చేసే ఒక మహిళ అనుకుని విధంగా.. తనకు రాని, తెలియని వంటను చేయాల్సి వస్తుంది.అప్పుడు తాను ఎదుర్కోన్న సమస్యలు ఏంటీ.. అసలు ఎందుకు ఆమె ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది సస్పెన్స్ గా చూపించారు. అయితే ఇక్కడ ప్రియమణి భయంతో ఒక పెద్ద కత్తి పట్టుకొని టెన్షన్ గా భయంతో దేన్నో కట్ చేయడం చూపించారు. కానీ ఏంటనేది చూపించకుండా ఆసక్తిని రేకెత్తించారు.

Also Read:

Khiladi: హిట్‌పై బీభత్సమైన కాన్ఫిడెన్స్.. సినిమా విడుదలకు ముందే డైరెక్టర్​కు కోటి రూపాయల కారు గిఫ్ట్

Coronavirus: సినీ తారలను వదలని కరోనా.. బాలీవుడ్ అందాల తార కాజోల్ కు పాజిటివ్..