విచారణై (విచారణ), అసురన్, కాకముట్టై తదితర హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. నిజ జీవితంలో జరిగిన అంశాలను ప్రేక్షకులకు నచ్చేలా సిల్వర్ స్ర్కీన్‌పై చూపించడం ఇతని ప్రత్యేక శైలి. అందుకే ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వెట్రిమారన్ నుంచి సినిమా వస్తోంది అనగానే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. అలాంటి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుతలై పార్ట్ 1. తెలుగులో విడుదల పార్ట్ 1 గా విడుదలైన ఈ సినిమాలో ఇప్పటివరకు కమెడియన్‌గా నవ్వించిన సూరి హీరోగా నటించాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించాడు. ఏప్రిల్ 15న తెలుగులో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. పలువురు సినీ ప్రముఖులు సైతం సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. తెలుగులో విడుదల సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేశారు.
థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న విడుదల పార్ట్ 1 ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ నిరీక్షనకు తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5 విడుదల మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. కాగా సోషల్ మీడియాలో వస్తోన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒక వేళ ఈ డేట్ కాకపోతే మే మొదటి వారంలోనైనా ఈ సూపర్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో భవాని శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, ఇతరులు కీలక పాత్రలు పోషిమంచారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..