
ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకీ మామా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగాథియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మేకర్స్ ఆడియెన్స్ కు షాకిచ్చారు. ఓటీటీ కంటే ముందు టీవీల్లో ఈ సినిమాను ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.
అయితే తాజాగా ఓటీటీపై మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. టీవీల్లో ప్రసారం చేయడంతో ఓకేసారి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అలాగే శాటిలైట్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగుతో పాటు జీ5లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5లో విడుదల చేసిన ప్రోమోలో చూపించారు. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ స్ట్రీమింగ్ కానుంది.
దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను నిర్మించారు. విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించారు. అలాగే ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ, నరేష్, వీటీవీ గణేష్, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస రెడ్డి, మురళీ ధర్ గౌడ్, మాస్టర్ రేవంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక భీమ్స్ సిస్రిలియో అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే టీవీల్లో లేదా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Evandoi! Vaallu vastunnaru!
Marinni vivaralu, kuusantha chamatkaram kosam vechi chudandi🙏🏼#2025BlockBuster #ComingSoon #ZEE5 #Zee5Telugu pic.twitter.com/K8sTACXngn
— ZEE5 Telugu (@ZEE5Telugu) February 20, 2025
Celebrating 25 DAYS of #SankranthikiVasthunam 🥳
Audience and #VictoryVenkatesh Fans Mass Jathara 💥🔥
ALL-TIME INDUSTRY HIT FOR A REGIONAL FILM 🔥
Victory @VenkyMama @AnilRavipudi @aishu_dil @Meenakshiioffl @SVC_official
Edit: @V_Rewind pic.twitter.com/9oAXJ9x9us
— Suresh Productions (@SureshProdns) February 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.