Sankranthiki Vasthunam OTT: బుల్లిరాజు వచ్చేశాడు.. ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం

బుల్లిరాజు ఇంట్లోకి వచ్చేశాడు. అదే నండి ఈ పొంగల్ కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన బుల్లిరాజు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాడు. ఇంటిల్లి పాదిని నవ్వించేందుకు ఓకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోకి ఈ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసింది.

Sankranthiki Vasthunam OTT: బుల్లిరాజు వచ్చేశాడు.. ఫైనల్లీ  ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతికి వస్తున్నాం
Sankranthiki Vasthunam Movie

Updated on: Mar 01, 2025 | 7:18 PM

విక్టరీ వెంకటేశ్‌ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకీ మామా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఇంటిల్లిపాదిని నవ్వించేందుకు ఒకేసారి ఓటీటీ, టీవీల్లోకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అండ్ శాటిలైట్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (మార్చి 01) సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్ లో ప్రసారమవుతోంది. అదే సమయంలో జీ5 ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఒక సినిమా ఇలా ఒకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ రావడం ఇదే మొదటిసారి. కాగా ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘సంక్రాంతి వస్తున్నాం’ స్ట్రీమింగ్ అవుతోంది.

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాను నిర్మించారు. కేవలం 72 రోజుల్లోనే అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అయితేనేం ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించవచ్చనే ప్రచారం జరుగుతోంది

ఇవి కూడా చదవండి

ఓటీటీతో పాటు టీవీలోనూ..

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ, నరేష్, వీటీవీ గణేష్, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస రెడ్డి, మురళీ ధర్ గౌడ్, మాస్టర్ రేవంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక భీమ్స్ సిస్రిలియో అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇంట్లోనే టీవీల్లో లేదా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.