విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నారప్ప. తమిళ స్టార్ ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. కుల వ్యవస్థ, భూ వివాదం.. వంటి సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ఆకట్టుకున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ .. కలైపులి థాను కలిసి నారప్పను నిర్మిస్తున్నారు. మణిశర్మ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీని ముందుగా మే 14న థియేటర్లలో విడుదల చేయాలని భావించింది చిత్రయూనిట్.
కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం పూర్తి స్థాయిలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నాయనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. దీంతో చిత్రయూనిట్ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నారప్ప చిత్రయూనిట్ తో చర్చలు జరిపిందని… అందుకు నారప్ప టీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ మూవీని జూలై 24న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. నారప్ప మూవీ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ కమిటీ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక థియేటర్ రిలీజ్ లేక ఓటిటి రిలీజ్ అనే విషయంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు నారప్ప టీం.
MLA Seethakka: రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కులు.. మేడారంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు