Unstoppable with NBK: ఆ స్టార్ హీరో ఎపిసోడ్‌తో ముగియనున్న బాలయ్య టాక్ షో సీజన్ 1..

|

Dec 22, 2021 | 4:18 PM

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Unstoppable with NBK: ఆ స్టార్ హీరో ఎపిసోడ్‌తో ముగియనున్న బాలయ్య టాక్ షో సీజన్ 1..
Nbk
Follow us on

Unstoppable with NBK: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నట సింహం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం హోస్ట్‌గా మారి టాక్ షో చేస్తున్నారు. అన్ స్టాపబుల్ అంటూ దూసుకులోతున్న ఈ టాక్ షోను బాలయ్య తనదైన స్టైల్‌లో టాప్ రేటింగ్‌లో ఉంచుతున్నారు.

ఈ షోకు వచ్చిన గెస్ట్ లపై ప్రశ్నలు వర్షాలు కురిపిస్తూనే తన డైన చమత్కారంతో నవ్వులు పూయిస్తున్నారు బాలయ్య. ఇక ఇప్పటివరకు ఈ షోకు చాలామంది గెస్ట్ లు హాజరయ్యారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో అన్ స్టాపబుల్ సీజన్ త్వరలోనే ముగియనుంది. ఇప్పటికే ఈ షోకు నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, అఖండ టీమ్, రాజమౌళి, కీరవాణి, అలాగే మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని హాజరయ్యారు. వీరితోపాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాలయ్య షోకు హాజరయ్యారు. రవితేజ, గోపిచంద్ మాలిని ఎపిసోడ్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ సీజన్ 1 ముగించనున్నారు. ఈ మేరకు త్వరలోనే మహేష్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నామని.. ఈ ఎపిసోడ్ తో సీజన్ 1 ముగుస్తుందని ప్రకటించారు ఆహా టీమ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Naga Chaitanya: నాగచైతన్య వెబ్ సిరీస్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. చైతూ అలా కనిపించనున్నాడట..

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..

Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్‌ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..

కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!