Unstoppable Promo: ఇచ్చిపడేసిన బాలయ్య… నటసింహం గర్జన ఓటీటీలో షురూ

|

Oct 27, 2021 | 6:16 PM

బాలయ్య అంటేనే మాస్... పవర్ హౌస్. ఆయన అడుపెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. తాజాగా ఓటీటీ ఎంట్రీకి సిద్దమయ్యారు నటసింహం.

Unstoppable Promo: ఇచ్చిపడేసిన బాలయ్య... నటసింహం గర్జన ఓటీటీలో షురూ
Balayya Aha
Follow us on

బాలయ్య అంటేనే మాస్… పవర్ హౌస్. ఆయన అడుపెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. తాజాగా ఓటీటీ ఎంట్రీకి సిద్దమయ్యారు నటసింహం. అచ్చ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా గర్జించనున్నారు. బాలయ్య చేస్తోన్న టాక్ షో ‘అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే’ ప్రోమో తాజాగా రిలీజైంది. స్టైలిష్​ లుక్​లో.. పంచ్​ డైలాగ్​లు చెబుతూ బాలయ్య అదరగొట్టారు. స్పోర్ట్స్​ కారు, స్పోర్ట్స్​ బైక్​ నడపడం సహా గుర్రపు స్వారి చేస్తూ బాలయ్య కనిపించారు. ప్రోమో చూసిన బాలయ్య ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

“నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు, నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు, నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్​ ఉండదు, సరదాలో స్టాప్​ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్​ ఐ స్టెప్​ ఇన్​” అంటూ బాలయ్య చెప్పే డైలాగ్​ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. నవంబరు 4న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్​ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.

YouTube video player

జానర్‌ ఏదైనా సిల్వర్ స్క్రీన్‌పై తన నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో కట్టిపడేసే బాలయ్య.. తొలిసారి హెస్ట్‌గా సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ ఫస్ట్  ఎఫిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.  ఇక ఈ షోకు తొలి సెలబ్రిటీగా మోహన్​బాబు రానున్నారని సోషల్ మీడియాలో వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. సెట్​లో బాలయ్య, మోహన్​బాబు కలిసి దిగిన ఫొటో కూడా వైరల్​ అయింది. తాజాగా అందుతోన్న ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే..మెగా ఫ్యామిలీనుంచి నాగబాబు రానున్నారని సమాచారం. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

Also Read: 48 వేల మందికి ఉద్యోగాలు… ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

విపరీతమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్