Trisha: పోలీస్ ఆఫీసర్‏గా త్రిష లుక్ అదుర్స్.. నెట్టింట్లో వైరలవుతున్న నయా ఫోటో..

|

Jan 24, 2022 | 8:34 AM

అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమెజ్ క్రియేట్ చేసుకుంది త్రిష. అతి తక్కువ సమయంలోనే

Trisha: పోలీస్ ఆఫీసర్‏గా త్రిష లుక్ అదుర్స్.. నెట్టింట్లో వైరలవుతున్న నయా ఫోటో..
వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది త్రిష. తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.
Follow us on

అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమెజ్ క్రియేట్ చేసుకుంది త్రిష. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ అగ్రకథానాయికలలో ఒకరిగా దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది త్రిష. చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇస్తుంది.

ఇటు వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది త్రిష. తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. దసరా రోజున ప్రారంభమైన ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా బృంద లోకేషన్ నుంచి తన ఇంట్రెస్టింగ్ ఫోటో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది త్రిష. అందులో షూటింగ్ బ్రేక్‏లో త్రిష సెట్‏లో దగ్గరకు తీసుకుంటూ కనిపించింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. మరో కోణంలో లిటిల్ లవ్ కూడా ఉంది అంటూ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది.

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..