
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. రష్మిక మందన్నా కాక్ టెయిల్ 2, కంగనా రనౌత్ భారతభాగ్య విధాత, సునీల్ కాటాలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇలా ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిసి సుమారు 20 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. అయితే వీటి కంటే ముందే ఒక తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా థియేటర్లలో రిలీజైన మూడేళ్లకు. టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ప్రేమదేశం. 2023 ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. సీనియర్ హీరోయిన్ రోజా ఫేమ్ మధుబాల ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా ఈ ప్రేమ దేశం సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు మరో ఓటీటీలోకి ఈ సినిమా వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోనూ ప్రేమ దేశం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీకాంత్ సిద్ధం తెరకెక్కించిన ప్రేమదేశం సినిమాలో త్రిగుణ్, మేఘా ఆకాశ్‌లతో పాటు సీనియర్ నటి మధుబాల, అమర్‌దీప్ చౌదరి, మాయ, తనకెళ్ల భరణి, వైష్ణవి చైతన్య, వైవా హర్ష తదితరులు కీలకపాత్రలు పోషించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ ప్రేమకథా చిత్రానికి సంగీతం అందించాడు. సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శిరీష్ సిద్ధం ప్రేమదేశం సినిమాను నిర్మించారు.ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రెండు జంటల మధ్య సాగే ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమలో ఉన్నా చెప్పుకోలేకపోయిన ఒక జంట.. పెళ్లయినా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయిన మరో జంట.. వీళ్ల జీవితాలను ఓ చిన్న యాక్సిడెంట్ ఎలా మార్చేసిందన్నదే ఈ ప్రేమదేశం సినిమా. వీకెండ్ లో ఓ మంచి ప్రేమకథా చిత్రం చూడాలనుకునేవారు ప్రేమదేశంపై ఒక లుక్కేసుకోవచ్చు.
Friendship. Love. Memories. ❤️
Relive the beautiful chaos of college life with #Premadesam
📅 Streaming from August 13 on @etvwin#Premadesam #ETVWIN pic.twitter.com/zHTZsrwJrf— ETV Win (@etvwin) August 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.