OTT
ఇప్పుడు మూవీలు, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లు బాగా పెరిగిపోయారు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది ఇళ్లలోనే ఉండిపోయి మూవీ కంటెంట్‌కు అలవాటుపడ్డారు. ఓటీటీలలో దేశ విదేశాల్లోని మూవీ కంటెంట్ అంతా అందుబాటులో ఉండటంతో.. విపరీతంగా చూశారు. దీంతో అటు థియేటర్స్ మూవీ చూసేవాళ్ల కంటెంట్ బాగా తగ్గిపోయింది. ఇక ఓటీటీలు సైతం విభిన్నమైన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు తీసుకువస్తూ వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా ఈవారం వివిధ ఓటీటీలలో అందుబాటులోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మీ కోసం.నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ జూలై 10న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు.
దాదాపు పుష్కర కాలం తర్వత విక్రమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు లోకనాయకుడు కమల్‌హాసన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఊహించని వసూళ్లను సాధించింది. ఈ మూవీలో చాలా హైలెట్స్ ఉన్నాయి. విజయ్ సేతుపతి విలన్ గా నటించగా మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్‌గా కీ రోల్ పోషించారు. ఈ సినిమా జూలై 8 నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఆరు ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు నగేష్ కుకునూర్, దేవికా బహుదానం, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించారు. ఆరు ప్రేమకథలతో అంథాలజీగా ఈ సిరీస్ తెరకెక్కింది.
పాక ది రివర్ ఆఫ్ బ్లడ్ (మలయాళం)—- సోనీ లివ్—- జులై 7
రణ్ వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్- జూలై 8- నెట్ ఫ్లిక్స్
జై భజరంగి- జూలై 8- ఆహా
కుంజెల్దో- జూలై 8 -జీ5
ది లాంగెస్ట్ నైట్ -జూలై 8 -నెట్ ఫ్లిక్స్
డియర్ ఫ్రెండ్ జూలై 10-నెట్‌ఫ్లిక్స్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.