OTT Movie: పెళ్లైన అమ్మాయిలే ఈ సైకో కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో పిచ్చెక్కిస్తోన్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

ఇతర జానర్లతో పోల్చుకుంటే సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఈ మధ్యన బాగా ఆదరణ పెరుగుతోంది. అందులోనూ ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కిల్లర్ ఎవరో తెలుసుకోవాలనే టెన్షన్, ట్విస్టులతో ఈ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

OTT Movie: పెళ్లైన అమ్మాయిలే ఈ సైకో కిల్లర్ టార్గెట్.. ఓటీటీలో పిచ్చెక్కిస్తోన్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Jun 22, 2025 | 3:29 PM

సైకో కిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేస్తాయి. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆద్యంతం ట్విస్టులు వస్తూనే ఉంటాయి. అలాగే ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ లోనే కిల్లర్ ను రివీల్ చేస్తారు. అప్పటి దాకా మనం ఎవరెవరినో ఊహించుకుంటాం. కానీ క్లైమాక్స్ లో మన అంచనాలకు చిక్కకుండా ఎవరో ఊహించని వ్యక్తి తెరపైకి వస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇందులో ఒక సైకో కిల్లర్ పెళ్లయిన మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. ప్లాన్ చేసి పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. అంతేకాదు కిల్లర్ బాధితుల వద్ద స్నోమ్యాన్‌ను, తన కాలింగ్ కార్డ్‌గా వదిలివేస్తుంటాడు. అంటే పోలీసులకు క్లూలు ఇచ్చి మరీ మర్డర్స్ చేస్తాడన్నమాట. థియేటర్లతో పాటు వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శితమైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. నార్వే రాజధాని ఒస్లోలో ఈ సీరియల్ కిల్లర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అక్కడ ఒక బ్రిలియంట్ పోలీసాఫీసర్ ఉంటాడు. అయితే ప్రేయసితో బ్రేకప్ వల్ల డిప్రెషన్ బారిన పడతాడు. మందుకు బానిస అవుతాడు. అదే సమయంలో నగరంలో కొందరు మహిళలు వరుసగా అదృశ్యమవుతారు. ఇలా కనిపించకుండా పోయిన మహిళల ఇంటివద్ద స్నోమ్యాన్ (మంచు బొమ్మ) ఉంటుంది. దానికి బాధితుల స్కార్ఫ్ చుట్టి ఉంటుంది. ఇలా ప్రతి క్రైమ్ సీన్ వద్ద స్నోమ్యాన్ బొమ్మ కనిపిస్తుంది.

 

ఇలా మహిళల అదృష్యానికి సంబంధించిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. బాధితులందరూ వివాహిత మహిళలేనని, వీళ్ళంతా వైవాహిక జీవితంలో అసంతృప్తి తో ఉంటారన్న విషయాలు తెలుస్తాయి. మరి ఆ సైకో కిల్లర్ పెళ్లయిన మహిళలని ఎందుకు చంపుతున్నాడు ? పోలీసులు అతడిని పట్టుకున్నారా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా పేరు స్నో మ్యాన్. 2017 ఆక్టోబర్ లో విడుదలైన ఈ మూవీకి  టోమస్ ఆల్ఫ్రెడ్‌సన్ దర్శకత్వం వహించారు. మైఖేల్ ఫాస్‌బెండర్ (హ్యారీ హోల్), రెబెక్కా ఫెర్గూసన్ (కాట్రిన్ బ్రాట్), షార్లెట్ గెయిన్స్‌బర్గ్ (రాకెల్), వాల్ కిల్మర్ (గెర్ట్ రాఫ్టో), జె.కె. సిమ్మన్స్ (ఆర్వే స్టోప్)  తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడీ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆపిల్ టీవీ ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..