
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు , ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అలాగే ఆహాలో టెలికాస్ట్ అవుతోన్న టాక్ షోలు, గేమ్ షోలు కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు ఇండియన్ ఐడల్. ఇప్పుడు సీజన్ 3 తో ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగింగ్ సెన్సేషన్ కార్తీక్ అలాగే గీతామాధురి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న ఈ షోకు ఎంతో మంది గెస్ట్ లు హాజరయ్యారు. ఇక ఇప్పుడు మరో గెస్ట్ ఎంట్రీతో తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ మరింత ఉత్సహంగా మారనుంది. ఈసారి స్టేజ్ పై సందడి చేసే సెలబ్రెటీ ఎవరో కాదు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.
నవీన్ పోలిశెట్టి ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 21వ, 22వ ఎపిసోడ్‌లలో సందడి చేయనున్నారు. మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత ఆయన కొత్త సినిమా గురించిన విశేషాల గురించి హోస్ట్ శ్రీరామ్ అడిగిన ప్రశ్నలకు పోలిశెట్టి స్పందిస్తూ, ఆరు నెలల క్రితం జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో తనకు అనేక ఫ్రాక్చర్లు అయ్యాయని, అది కొంత నిరాశకు దారితీసిందని తెలిపాడు.
గడిచిన ఆరు నెలలు చాలా సవాలుతో కూడుకుంది, గాయపడిన తన చేయి కోలుకుంటుందో లేదోనని ఆందోళనతనలో ఉండేదని అన్నారు. ఇక ఇప్పుడు నవీన్ తిరిగి కోలుకుంటున్నారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ..”గత ఆరు నెలలు నాకు చాలా సవాలుగా ఉన్నాయి. గాయపడిన నా చేతి కదలికను తిరిగి పొందుతుందా అని నేను చాలా ఆందోళన చెందాను. ఈ కష్ట సమయంలో, సంగీతం నాకు ఓదార్పునిచ్చింది. కష్టకాలంలో ప్రజలు మద్దతు, ప్రోత్సాహాన్ని అందించారు.. సమయాలు , మెడిసన్ వర్క్ అవ్వోచ్చు..కాకపోవొచ్చు..కానీ ఈ సవాళ్లను అధిగమించడంలో నాకు నిజంగా సహాయపడింది సంగీతం ఒక్కటే, ఈ అనుభవం సంగీతం పట్ల నా ఆసక్తిని మరింతగా పెంచింది. తెలుగు ఇండియన్ ఐడల్ 3 సింగర్స్ అందరికి నన్ను పెద్ద అభిమానిని చేసింది. ” అన్నాడు నవీన్ పోలిశెట్టి.
తన కోలుకోవడం గురించి చర్చించడంతో పాటు, పోలిశెట్టి తన రాబోయే రెండు సినిమాల గురించి వెల్లడించాడు. షోలో ప్రత్యక్షంగా ఒక పాటను ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకులను ఆనందపరిచాడు. ఈ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్ లో నవీన్ చేసే సందడిని మనం చూడొచ్చు.
ఈ సూపర్ ఎనర్జిటిక్ ఎపిసోడ్ చూసి తీరాల్సిందే.. ఆహా యాప్ లింక్ కోసం ఇక్క క్లిక్ చేయండి
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..