
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా.. కొత్త కంటెంట్ చిత్రాలను జనాల ముందుకు తీసుకువస్తుంది. అలాగే ఇతర భాషలలో హిట్టైన సినిమాలను సైతం తెలుగులో సినీప్రియులకు అందిస్తుంది. ఇక చాలా కాలంగా సరికొత్త గేమ్ షోస్, టాక్ షోలతోపాటు ప్రతిభ ఉండి నిరూపించుకునేందుకు సరైన ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూస్తున్న సింగర్స్ కోసం తెలుగు ఇండియన్ ఐడల్ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సీజన్లలో ఎంతో మంది గాయనిగాయకులు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సీజన్ 4 విజయవంతంగా రన్ అవుతుంది. ఎప్పటిలాగే జడ్జీలుగా తమన్, సింగర్ కార్తిక్, సింగర్ గీతా మాధురి అలరిస్తుండగా.. సింగర్ శ్రీరామచంద్ర, సమీరా భరద్వాజ్ హోస్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఇప్పటికే ఈ షోలో పలువురు సినీతారలు పాల్గొని గాయనీగాయకులకు మరింత భరోసా అందించారు. తాజాగా లేటేస్ట్ హిట్స్ సాంగ్స్ తో ఇరగదీసేందుకు రెడీ అయ్యారు సింగర్స్. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమోలో ఇటీవల సూపర్ హిట్ అయిన పాటలతో ఎంట్రీ ఇచ్చారు సింగర్స్. బుట్టబొమ్మ పాటతో అదరగొట్టేశాడు సింగర్ పవన్ కళ్యాణ్.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఈషోలో మిత్రమండలి మూవీ టీమ్ పాల్గొని సందడి చేసింది. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయార్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ ఎమ్ ఇండియన్ ఐడల్ షోలో సందడి చేశారు. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..