Telugu Indian Idol 2: గ్రాండ్ గా ప్రారంభమైన ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2.. ఈసారి హోస్ట్‌తో పాటు జడ్జ్ కూడా మారిపోయారు

| Edited By: Rajeev Rayala

Feb 23, 2023 | 7:16 PM

తెలుగు సంగీత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సింగింగ్‌ షో సెకండ్ సీజన్ రాబోతుంది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్‌ రైజర్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్‌ ఠాకూర్‌, ప్రముఖ సింగర్లు, ఎస్‌.ఎస్‌. థమన్‌, కార్తీక్‌, గీతామాధురి, హేమచంద్ర తదితరలు హాజరయ్యారు.

Telugu Indian Idol 2: గ్రాండ్ గా ప్రారంభమైన ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 2.. ఈసారి హోస్ట్‌తో పాటు జడ్జ్ కూడా మారిపోయారు
Aha Indian Idol Telugu 2
Follow us on

ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో సూపర్ హిట్ అయిన షోలలో ఇండియన్ ఐడల్ తెలుగు ఒకటి. యంగ్ సింగర్స్‌కు తమ ట్యాలెంట్‌ నిరూపించుకోవడానికి ఈ సింగింగ్‌ షో మంచి వేదికగా నిలిచింది. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్.. సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించి సందడి చేశారు. జయంత్, వాగ్దేవి , శ్రీనివాస్, వైష్ణవి , ప్రణతీ లాంటి తెలుగు సింగర్లు ఈ షోలో తమ పాటలతో మెప్పించారు. అయితే చివరకు సింగర్‌ వాగ్దేవి విజేతగా నిలిచింది. గ్రాండ్‌ ఫినాల్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చేసి సందడి చేశారు. ఇలా తెలుగు సంగీత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సింగింగ్‌ షో సెకండ్ సీజన్ రాబోతుంది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్‌ రైజర్ ప్రోగ్రాం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్‌ ఠాకూర్‌, ప్రముఖ సింగర్లు, ఎస్‌.ఎస్‌. థమన్‌, కార్తీక్‌, గీతామాధురి, హేమచంద్ర తదితరలు హాజరయ్యారు. కాగా గత సీజన్‌లో ఇండియన్‌ ఐడల్‌ షోకు ప్రముఖ సింగర్‌ శ్రీరామచంద్ర హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే తాజా సీజన్‌లో అతని స్థానంలో మరో ప్రముఖ సింగర్‌ హేమచంద్ర సింగింగ్‌ షోను హోస్ట్‌ చేయనున్నారు. ఇక జడ్జీల విషయానికొస్తే… సింగర్‌ నిత్యామేనన్‌ ప్లేస్‌లో ట్యాలెంటెడ్‌ సింగర్ గీతా మాధురి రానుంది.

కాగా కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ సందర్భంగా మాట్లాడిన థమన్‌.. తెలుగు ఇండియన్ ఐడల్ షక్ష తన హృదయానికి చాలా దగ్గరైందన్నారు. ‘ నాకు మొదటి సీజన్ నుండి ఈ షోతో అనుబంధం ఉంది. ఇప్పుడు సెకెండ్‌ సీజన్‌ ప్రారంభమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. మొదటి సీజన్‌ కంటే రెండో సీజన్‌ మరింత గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అంతకుముందు సీఈవో అజిత్‌ ఠాకూర్‌ ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..