
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. లావణ్య త్రిపాఠి నటించిన సతీలీలావతి, కమెడియన్ సత్య జైట్లీ, మేము కాపులం అనే వెబ్ సిరీస్, సోనాక్షి సిన్హా, జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్, మలయాళ హిట్ సినిమా మధు విదు వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అయితే వీటికంటే ముందే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. కానీ పెద్దగా సందడి చేయలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో త్వరగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. దీంతో అతని మొబైల్ ఫోన్, పర్స్ మిస్ అవుతుంది. అయితే అందులోనే ఓ హవాలా నోటు ఉంటుంది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బెదిరింపులు, హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు పైసావాలా.. కె.నవీన్ తేజస్ తెరకెక్కించిన ఈ సినిమాలో అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నగేశ్ గౌరీష్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఎఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వికెఎం మూవీస్ బ్యానర్స్పై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ బేసిస్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారు ఈ పైసావాలా మూవీపై ఓ లుక్కేసుకోవచ్చు.
Ott. Prime Video.
—
పైసావాలా’ (2025) (Paisawala) చిత్రం అధ్విక్ (రాజేశ్ బెజ్జంకి), శ్రీధర్, సృజనాక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు చిత్రం. కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ రూ. 10 హవాలా నోటు చుట్టూ తిరుగుతుంది.
—
ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
–… pic.twitter.com/vF061zimXM— G B Rao (@gbrao100) May 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.