Telugu Indian Idol Season 2: అమెరికాలో డాక్టర్.. అయినా కూడా సంగీతం పై మక్కువతో ఇండియన్ ఐడల్‌కు

|

Mar 11, 2023 | 6:12 AM

గేమ్ షోస్ తో పాటు.. టాక్ షోలతోనూ అలరిస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తోన్న ఓటీటీ సంస్థ ఆహా ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.

Telugu Indian Idol Season 2: అమెరికాలో డాక్టర్.. అయినా కూడా సంగీతం పై మక్కువతో ఇండియన్ ఐడల్‌కు
Sruthi Nanduri
Follow us on

100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఆహా.. గేమ్ షోస్ తో పాటు.. టాక్ షోలతోనూ అలరిస్తోంది. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తోన్న ఓటీటీ సంస్థ ఆహా ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. వీటితో పాటే ప్రతిభకు పట్టం కడుతూ ఎంతో మంది సింగర్స్ ను వెలుగులోకి తీసుకొస్తోంది ఆహా. తెలుగు ఇండియన్ ఐడిల్ కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఎంతో మంది మంచి సింగర్స్ ను పరిచయం చేస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ ను కూడా మంచి ప్రేక్షకాదరణతో పూర్తి చేసిన ఆహా.. ఇప్పుడు సెకండ్ సీజన్ కు రెడీ అయ్యింది. ప్రస్తుతం సీజన్ 2 ఆడిషన్స్ జరుగుతున్నాయి.

ఈ ఆడిషన్స్ కు ఎంతో మంది అద్భుతమైన సింగర్స్ వచ్చి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటీవలే జవాన్ చక్రపాణిని కూడా పరిచయం చేసింది. దేశ సేవ చేసే చక్రపాణి తన గాత్రంతో అబ్బురపరిచారు. తాజాగా మరో మధురమైన గాత్రాన్ని పరిచయం చేసింది ఆహా.

ఆమె పేరు శృతి నండూరి. శృతి అమెరికాలో డాక్టర్. వృత్తిపరంగా వైద్య సేవ చేస్తూనే సంగీతాన్ని కూడా సాధన చేసినతో శృతి. మ్యూజిక్ ను మెడిసన్ కు కలపడమే తన గోల్ అని తెలిపింది శృతి. శృతి నండూరికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా. ఆమె అద్భుత గాత్రాన్ని మీరు వినండి.