అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న తమ ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో మార్పులు చేస్తామని, ఏ మతం, లేదా కులం వారిని గానీ, హిందూ దేవుళ్లను, గానీ, దేవతలను గానీ కించపరచాలన్నది తమ ఉద్దేశం కాదని ఈ సిరీస్ మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సిరీస్ లో నటిస్తున్న నటీనటులు, డైరెక్టర్ తదితరులు బేషరతుగా క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే, సైఫ్ లీఖాన్, డింపుల్ కపాడియా, జేషన్ ఆయూబ్ ప్రభృతులంతా ఈ మేరకు అపాలజీ చెప్పాక కూడా దీనిపై వివాదం సద్దుమణగలేదు. యూపీ, మహారాష్ట్ర పోలీసు స్టేషన్లలో వీరిపై కేసులు అలాగే ఉన్నాయి. యూపీలో ఓ పోలీసు తాను 17 నిముషాల మొదటి ఎపిసోడ్ చూశానని, ఇందులో హిందూ దేవతలను, దేవుళ్లను కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయని తెలిపాడు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాదారు శలభ్ మణి త్రిపాఠీ ఈ సిరీస్ యూనిట్ ని తీవ్రంగా హెచ్ఛరించారు. తాము ముంబైకి వచ్చి.. ఎలా ప్రతీకారం తీర్చుకుంటామో చూడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లోగడ జరిగిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ గురించి ఆయన ప్రస్తావించారు. తాండవ్ సిరీస్ లో ప్రధాని క్యారక్టర్ ని కూడా దిగజారుడుగా చూపారన్న ఆరోపణలున్నాయి.
తాజాగా నిన్న మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో కూడా ఈ సిరీస్ పై కేసు నమోదయింది. దీని యూనిట్ సభ్యులపైనా, నటీనటులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.
NEET 2021: నీట్ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర విద్యాశాఖ.. ఈ సారి ప్రశ్నపత్రంలో ఆ అవకాశం..