
ఈమధ్య కాలంలో ఓటీటీలోకి కొత్త కొత్త జానర్ చిత్రాలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా హారర్, మిస్టరీస్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు రొమాంటిక్, లవ్ స్టోరీస్ సైతం ఓటీటీలో దూసుకుపోతున్నాయి. తమిళం, మలయాళం, కన్నడ లాంటి భాషల్లోనూ ఈ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేస్తున్నారు. తాజాగా మరో తమిళ్ హిట్ చిత్రాన్ని సైతం తెలుగులో రిలీజ్ చేయనున్నారు అదే ‘ష్’. 2024లో నేరుగా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తమిళం, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో అందుబాటులో ఉంది.
‘ష్’ సినిమాను తెలుగు వెర్షన్ ఏప్రిల్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్ స్పూర్తితోఈ సినిమాను తెరకెక్కించారు. నలుగురు అమ్మాయిల జీవితాలను ఆధారంగా చేసుకుని నాలుగు కథలతో నిర్మించిన సినిమానే ఇది. ప్రేమ, రొమాన్స్ వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో క్లాప్ ఫేమ్ పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్ ప్రధాన పాత్రలు పోషించగా.. IB కార్తికేయన్ దర్శకత్వం వహించారు. 7/G బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనియా ఈ చిత్రంలో ప్రొఫెసర్ పాత్రలో నటించింది. ఇన్నాళ్లు తమిళ సినీప్రియులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి తెలుగు అడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..