OTT Movie: ఆ మొండి చేయి ఎవరిది? ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

ఇప్పుడు సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ లు కూడా తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్, హారర్ వెబ్ సిరీస్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. భాషతో సంబంధం లేకుండా ఈ సిరీస్ లను చూసేస్తున్నారు. అలాంటి వారి కోసం మరో క్రైమ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: ఆ మొండి చేయి ఎవరిది? ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు
OTT Movie

Updated on: Nov 30, 2025 | 6:56 PM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక క్రైమ్ వెబ్ సిరీస్ కూడా ఉంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సీన్లతో సాగే ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఒక ఐస్‌ ట్రక్‌ అనూహ్యంగా ప్రమాదానికి గురవుతుంది. డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోతాడు. అయితే ఆ ట్రక్‌లో ఓ మొండి చేయి బయట పడుతుంది. అసలు ఆ చేయి ఎవరిది? దాని వెనుక ఉన్న హంతకులు ఎవరున్నారని తెలుసుకునే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెడతారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. మొండి చెయ్యి రేఖలతో మరో ఆరుగురి రేఖలు కనుగొనబడతాయి. దీంతో ఈ మిస్టరీ కేసు విచారణ మరింత క్లిష్టంగా మారుతుంది. కేసు ఛేదించే యత్నంలో పోలీసులు బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. అయితే ఇదే సమయంలో పక్క డిపార్టెమెంట్‌లోనూ కొందరు ప్రముఖులు పోలీసుల విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. చివరకు మానవ అవయవాల రాకెట్ తో, ఈ మొండి చేయికి సంబంధముందని తెలుసుకుంటారు? మరి ఈ అసలు ఆ మొండి చేయి ఎవరిది? ఈ మిస్టరీ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? చివరికీ ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఊహకు అందని సంఘటనలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు రేకై. ప్రముఖ నవలా రచయిత రాజేశ్‌ కుమార్‌ రాసిన క్రైమ్‌ నవల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించారు ఎం.దినకరన్‌. బాలహాసన్‌, పవిత్ర జనని, బోపాలన్‌ ప్రగదీశ్‌, వినోదిని వైద్యనాథన్‌, శ్రీరామ్‌.ఎం, అంజలిరావ్‌, ఇంద్రజిత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. శుక్రవారం (నవంబర్ 28) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ క్రైమ్ సిరీస్ కేవలం తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.