
ఈ వారం థియేటర్లలో భైరవం, షష్టి పూర్తి సినిమాలు మాత్రమే థియేటర్లలో కి వచ్చేశాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం మస్ట్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఎందుకంటే ఇప్పటికే నాని హిట్-3 ది థర్డ్ కేస్, మోహన్ లాల్ తుడ్‌రుమ్ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో పాటు ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మేడే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొదట మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చినా తెలుగులో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీనికి తోడు పోటీగా నిలిచిన సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ కు నామమాత్రపు స్పందన వచ్చింది. హీరో, హీరోయిన్ల అభినయం, అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్సులు మాత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే అంతర్లీనంగా ప్రేమ కథ కూడా ఉండడంతో మూవీ లవర్స్ కు ఈ చిత్రం బాగా నచ్చేసింది. తమిళంలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు రెట్రో. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో విలక్షన నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై దకనిపించింది. మలయాళ నటుడు జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, సుజిత్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా రెట్రో మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణణ్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ సినిమాలు, అలాగే సూర్య మూవీస్ ను ఇష్టపడే వారు రెట్రోపై ఒక లుక్కేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Yuddha modalaayitu. Eega Paari ready. 🔥
Watch Retro, out 30 May, on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam. #RetroOnNetflix pic.twitter.com/JDJDiUozxv— Netflix India South (@Netflix_INSouth) May 29, 2025
Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?
Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.