OTT Movie: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో మలయాళం అందాల తార మమితా బైజు హీరోయిన్ గా చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హీరో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూర్య నటన, మమితా బైజు అల్లరి, రాధిక, రవీనా టాండన్ ల అభినయం, డైరెక్టర్ వెంకీ అట్లూరి టేకింగ్, అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ పాటలు.. వెరసి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను బ్లాక్ బస్టర్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లతో ఆడుతోంది. అదే సమయంలో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు- ఐదారు వారాలకే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ సెప్టెంబర్ 11 వ తేదీ నుంచే స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఒకేసారి సూర్య సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను నిర్మించారు. సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే నాజర్, సునీల్ రెడ్డి, రాజీవ్ మేనన్, హర్ష చెముడు, కాళి వెంకట్, దీపా శంకర్, హైపర్ ఆది, మైమ్ గోపి, సర్వదమన్ బెనర్జీ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన విశ్వనాథం అండ్ సన్స్ ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
నెట్ ఫ్లిక్స్ లో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్..
Coming Soon : Vishwanath And Sons 🍿 OTT: Netflix Audio: Tamil ✅, Telugu, Kannada, Malayalam, Hindi Quality: 4K DOLBY ATMOS (Expected)
Kutty Bro: டேய் பெரிய ப்ரோ, தியேட்டர்ல பார்க்க முடியாம போச்சேன்னு கவலையா இருந்துச்சுடா! எப்போல இருந்து Netflix-ல வருது?
Periya Bro:… pic.twitter.com/rTqsAuDtDG
— Kutty Bro VS Periya Bro 🏏 (@KuttyBvsPeriyaB) September 5, 2026
h3>విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
