కొన్నిసార్లు థియేటర్లలో హిట్ కానీ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఇటీవల కొన్ని సార్లు బిగ్ స్ర్రీన్‌పై ఆకట్టుకోకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్‌పై రికార్డులు సృష్టిస్తున్నాయి. రవితేజ రావణాసుర, ఆది టాప్ గేర్, సీఎస్‌ఐ సనాతన్ వంటి సినిమాలో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలో మాత్రం రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా చేరింది. అదే యంగ్ హీరో అశ్విన్ నటించిన హిడింబ. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో నందితా శ్వేత కథానాయిక. జూలై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిడింబ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. సరికొత్త జానర్, ఆకట్టుకునే కంటెంట్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేకు తోడు నటీనటులు అద్భుతంగా నటించినా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం రికార్డులు కొల్లగొడుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా హిడింబ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి హిడింబ సినిమా ఆహాలోకి అందుబాటులోకి వచ్చింది.
బిగ్ స్క్రీన్‌పై ఆకట్టుకోని హిడింబ ఓటీటీలో మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆగస్టు 23 వరకు ఈ సినిమాకు ఏకంగా 150 మిలియన్ నిమిషాలకు పైగా స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఆహా ఓటీటీ. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుందని అందులో పేర్కొన్నారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ హిడింబ సినిమాను నిర్మించారు. ఏక్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ సినిమాను సమర్పించారు. అశ్విన్, నందితో పాటు శ్రీనివాసరెడ్డి, మకరంద్ దేశ్ పాండే, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, రఘు కుంచె, సంజయ్ స్వరూప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు బాడిస వికాస్ స్వరాలు సమకూర్చారు.
హిడింబ కథ విషయానికి వస్తే.. నగరంలోని అమ్మాయిలు వరుసగా కిడ్నాప్‌కు గురవుతుంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన అశ్విన్, నందితలకు ఊహించని వాస్తవాలు తెలుస్తాయి. మనుషుల రక్తం తాగే హిడింబ జాతికి చెందిన ఒక మనిషి సాధారణ మనుషుల్లో తిరుగుతున్నాడని తెలుసుకుంటారు. మరి ఆ నరరూప రాక్షసుడు ఎవరు? పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనేది తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఓ రేంజ్‌లో ఉందంటున్నారు ఆడియెన్స్.
150 Million Screaming Minutes ☠️😈😈🥳 #HidimbhaOnAHA Streaming Now!
▶ https://t.co/fogxrv8ZyD
@imashwinbabu @Nanditasweta @aneelkanneganti #SreedharGangapatnam @AnilSunkara1 #SVKCinemas @AKentsOfficial #OAK pic.twitter.com/q2lbCnBH9z— ahavideoin (@ahavideoIN) August 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..