Prasanna Vadanam OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ప్రసన్న వదనం.. సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన సుహాస్..

|

Jun 02, 2024 | 7:23 AM

ముఖాలు గుర్తించలేని ఫేస్ బ్లైండ్‏నెస్ అనే సమస్య ఉన్న యువకుడిగా మరోసారి తనదైన నటనతో అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి ఈసినిమాను నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది.

Prasanna Vadanam OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ప్రసన్న వదనం.. సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన సుహాస్..
Prasanna Vadanam Movie
Follow us on

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా ప్రసన్న వదనం. ఫేస్ బ్లైండ్‏నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‏తో డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే తెరకెక్కించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో గ్రాండ్‏గా విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. అతి తక్కువ బడ్జెట్‏తో రూపొందించిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న కీలకపాత్రలు పోషించారు. ముఖాలు గుర్తించలేని ఫేస్ బ్లైండ్‏నెస్ అనే సమస్య ఉన్న యువకుడిగా మరోసారి తనదైన నటనతో అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి ఈసినిమాను నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 24న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్ స్టోన్ దాటింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసిందని పోస్టర్ షేర్ చేసింది. ఓటీటీలో విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ఈ మార్క్ క్రాస్ చేసింది ఈ మూవీ. మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటి.. ఆహాలో అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు 100 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.

ఇదిలా ఉంటే.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో సుహాస్. కానీ ప్రసన్న వదనం సినిమా కంటే ముందు సుహాస్ నటించిన శ్రీరంగనీతులు మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చాలా కాలం తర్వాత ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి వీఎస్ఎస్ ప్రవీణ్ దర్శకత్వం వహించగా.. విరాజ్ అశ్విన్, కార్తిక్ రత్నం, రుహానీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.