
గాలోడు సినిమాతో హీరోగా మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్. అదే సక్సెస్ జోష్‌ను కొనసాగిస్తూ కాలింగ్ సహస్ర అనే ఓ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వచ్చాడు. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథానాల్లో కొత్త దనం ఉన్నా రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ కావడంతో కాలింగ్ సహస్ర మూవీ పెద్దగా ఆదరణ నోచుకోలేకపోయింది. అయితే సుడిగాలి సుధీర్‌ను ఓ కొత్త రోల్‌లో చూపించడంతో ఫ్యా్న్స్‌కు బాగానే నచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌తో సరిపెట్టుకున్న కాలింగ్ సహస్ర ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా. కొత్త సంవత్సరం కానుకగా సోమవారం (జనవరి 1) అర్ధ రాత్రి నుంచే సుధీర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం కాలింగ్ సహస్ర సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
అరుణ్ విక్కిరాలా తెరకెక్కించిన కాలింగ్ సహస్ర సినిమాలో సుధీర్ సరసన డాలీషా కథానాయికగా నటించింది. స్పందన, శివబాలాజీ, సుభాష్, రవిప్రకాశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోహిత్ రెహమానిక్ సంగీతం అందించారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ బ్యానర్లపై విజేష్ తాయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి సంయుక్తంగా కాలింగ్ సహస్ర సినిమాను తెరకెక్కించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఓ సిమ్ ద్వారా అజయ్ శ్రీవాత్సవ (సుడిగాలి సుధీర్) లైఫ్‌లోకి సహస్ర వస్తుంది. అసలు ఆమె ఎవరు? సహస్ర గురించిన అన్వేషణలో అజయ్ తెలుసుకున్న వాస్తవాలేమిటి? తన సోదరి మరణం వెనకనున్న మిస్టరీని అజయ్ ఎలా ఛేదించాడన్నదే కాలింగ్ సహస్రి సినిమా కథ. సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ సినిమాలు చూసే వారికి కాలింగ్ సహస్ర మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సుధీర్.
#CallingSahasra OTT RELEASE NOW
Calling Sahasra Suspense & Thriller Telugu Full Movie Now Streaming on @PrimeVideoIN #CallingSahasraOnPrime #SudigaliSudheer pic.twitter.com/onr31wAcDz— OTTGURU (@OTTGURU1) January 1, 2024
Happy new year pic.twitter.com/dEnSVNfNq0
— Sudigali Sudheer (@sudheeranand) January 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.