
గతేడాది స్వాగ్ తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు మరోసారి కామెడీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. అతను నటించిన తాజా చిత్రం సింగిల్. కేతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. రిలీజ్ కు ముందే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు. దీంతో రిలీజ్ కు ముందే సింగిల్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే మే 09న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు, కేతిక, ఇవానా మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. మొత్తానికి సింగిల్ తో మరో సూపర్ హిట్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పటికే ఈ సినిమా రూ. 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సింగిల్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.
సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అంటే జూన్ 6వ తేదీన లేదా జూన్ 12న సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందన్నమాట.
గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సింగిల్ సినిమాను నిర్మించారు. వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్ శ్రీను, సత్య, రెబా మోనికా జాన్, మానస చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూర్చారు.
It’s a Blockbuster Sunday at the Box-office for #Single 💥
Theatres are echoing with fun & laughter 🤩 And Crowds are loving every moment of #SingleMovie 🤗🔥
🎟️ https://t.co/0LPVc1bviF @sreevishnuoffl @TheKetikaSharma @i__ivana_ #AlluAravind @caarthickraju #VidyaKoppineedi… pic.twitter.com/PpiddHBJjr
— Geetha Arts (@GeethaArts) May 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.