గత కొన్నాళ్లుగా ఓటీటీలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. అడియన్స్ పల్స్ కనిపెట్టేసిన మేకర్స్ నిత్యం ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్, మర్డర్ మిస్టరీ కంటెంట్ తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువగా కామెడీ సిరీస్ చూసేందుకు కూడా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది. అదే శశిమథనం. బుల్లితెరపై తనదైన పంచులతో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనియా సింగ్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పవన్ సిద్ధు, కీర్తి, రూపలక్ష్మి, కృతిక, అశోక్ చంద్ర, కేశవ్ దీపక్, అవంతి దీపక్, శ్రీలలిత పమిడిపాటి కీలకపాత్రలు పోషించారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సిరీస్ కు వినోద్ గాలి దర్శక్తవం వహిస్తుండగా.. ఈసిరీస్ ను పూర్తి స్తాయి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఈ సిరీస్ టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఫ్యామిలీ మొత్తం పెళ్లికి వెళ్లడంతో తన ప్రియుడు మదన్ (పవన్ సిద్ధూ)ను ఇంట్లోకి పిలుస్తుంది శశి (సోనియా సింగ్). కానీ ఇంట్లో వాళ్లు ఆకస్మాత్తుగా రావడంతో మదన్ ను ఇంట్లోనే దాచిపెడుతుంది. కానీ శశి ప్రవర్తన చూసిన ఇంట్లోవాళ్లకు అనుమానం కలుగుతుంది. ఇలా మదన్, శశి ఇంట్లో వాళ్లతో దాగుడుమూతల మధ్య ఈ సిరీస్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. ఇంట్లోనే ఉన్న మదన్, శశి ఇద్దరూ ఇంటి సభ్యులకు దొరుకుతారా..? ఆ తర్వాత పరిస్థేంటీ ? అనేది సిరీస్ లో చూడాలి.
శశిమధనం వెబ్ సిరీస్ ను జూలై 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. “దాగుడు మూతలు దండాకోర్! ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్‌చుప్!” అంటూ స్ట్రీమింగ్ డేట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది ఈటీవీ విన్. సాయి ధరమ్ తేజ్ నటించిన విరాట పర్వం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అంతకు ముందు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన సోనియా.. విరాటపర్వం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
దాగుడు మూతలు దండాకోర్!
ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్‌చుప్!🫣Watch Sasimadhanam
Premieres July 04 on ETV WIN App
First Episode Free.#Sasimadhanam#EtvWin #WinThoWinodam pic.twitter.com/EKQ2MJzY0n— ETV Win (@etvwin) June 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.